Natyam ad

మంత్రి కారుమూరి పర్యటన

మంత్రి కారుమూరి పర్యటన
ఏలూరు ముచ్చట్లు:

 

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులను మంత్రి కారుమూరి నాగేశ్వరావు పరామర్శించి తడిసిపోయిన ధాన్యం కల్లాలను పరిశీలించారు.  పశ్చిమగోదావరి జిల్లా దువ్వ ,వరిగేడు గ్రామాల్లో  పర్యటించి రైతులతో మాట్లాడారు . మిచాంగ్ తుఫాన్ కు రైతులు ఎవ్వరు అధైర్యపడద్దని ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని అయినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హమి ఇచ్చారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలని సూచించారు. ఆఫ్ లైన్  ఆన్ లైన్ రెండు విధాలుగానూ  ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించామన్నారు. ఏమిల్లరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకొంటామన్నారుతుఫాన్ తీవ్రత  తగ్గేవరకూ  అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

 

Post Midle

Tags: Minister’s visit to Karumuri

Post Midle