తాళ్లపూడిలో మంత్రి వనిత పర్యటన

కొవ్వూరు  ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామంలో రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ రైతు భాందవుడుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట  వ్యవసాయాన్ని పండుగగా చెయ్యడం జరిగిందని అన్నారు. మంగళవారం ఉదయం  తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద ఖరీఫ్ సాగు కోసం 1,57,544 ఎకరాల ఆయకట్టు కు నీతిని మంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అండగా మన ప్రభుత్వం నిలిచిందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి , వారికి భరోసాగా  నిలుస్తున్నామన్నారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, సంక్షేమ పాలనను అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎడమ కాలువ కింద 14 మండలాల్లోని 135 గ్రామాల పరిధిలోని  2,06,600 ఎకరాల ఆయకట్టు కు సాగునీటి అందించాలనే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో 1,57,544 ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరో 50 వేల ఎకరాల కు నీరు అందించడానికి సిద్ధం గా ఉన్నామని మంత్రి తెలిపారు.

ఈ ఏడాది కొత్తగా మరో 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నా మన్నారు. వైఎస్సార్ ఆశయాలను ఆయన కుమారుడిగా  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు పేర్కొన్నారు. గోపాలపురం వద్ద హెచ్ పి గ్యాస్ లైన్ సమస్యను పరిష్కరించి, మరో 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం జరుగుతోందని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతు పక్ష పాత ప్రభుత్వం అని, ఆర్బికే ల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించి అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ భవన రత్నకుమారి, ఏ ఎంసీ ఛైర్మన్ వి. గంగాధర్ శ్రీనివాస్,  ఇరిగేషన్ అధికారులు ఎస్సి బి. శ్యాం ప్రసాద్, ఈఈ లు బి.ఏసుబాబు, కె. శేషుబాబు, డి ఇ లు వి.పెద్దిరాజు, పి.ధనుంజయ్, తహశీల్దార్ ఎమ్. నరసింహమూర్తి, తాడిపూడి సర్పంచ్ నామ శ్రీనివాసులు, ఆరికిరేవుల సర్పంచ్ మట్టా శ్రీనివాస్, స్థానిక నాయకులు, అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Minister’s visit to Thallapudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *