డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు

మహబూబ్ నగర్  ముచ్చట్లు :
మహబూబ్ నగర్ అర్బన్ దివిటిపల్లి గ్రామంలో 66 కోట్ల రూపాయలతో చేపట్టిన 1024 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు  వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారందరికీ ఛాలెంజ్ విసురుతున్నా. దివిటిపల్లి లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీ  దేశంలో ఎక్కడైనా ఉందా? ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అవినీతి చేశారు. 19వేల కోట్ల రూపాయల తో దాదాపు రెండు లక్షల డెబ్భై వేల ఇండ్ల  ఇండ్ల నిర్మాణము చేపట్టాం. డబ్బుకు వెనకాడకుండా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు.

పేదల ఇండ్ల నిర్మాణం చేపడితే అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. పేదలు ఆత్మగౌరవం తో బ్రతకాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. కళ్యాణ లక్ష్మీ,1000 రెసిడెన్షియల్ స్కూల్ ,ఆసరా ఫించన్ లు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్లు మోరిగే కుక్కలు ఒకసారి ఆలోచించుకోవాలి… మీ ముఖ్యమంత్రి లు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పథకాలు ఉన్నాయా? 90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొన్నది..ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ రాష్ట్రాల్లో కొన్నారా అని ప్రశ్నించారు.
అభివృద్ధి ,సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రం తో పోటీ పడలేరు. మీ ముఖ్యమంత్రి లు ఏం చేస్తున్నారో…ఒక్కసారి ఆలోచించుకోండి. పని చేసిన వాళ్ళను ఆదరించండి.. చేయని వాళ్ళను దూరం పెట్టండి..అలాంటప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు లేకున్నా…అక్రమ ప్రాజెక్ట్ లు చేపడుతున్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం,ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవు. కృష్ణ నీటిని తరలించుకు పోతుంటే అప్పటి ఈ జిల్లా మంత్రి హారతులు పట్టిందని అన్నారు.
పోతిరెడ్డిపాడు నీటిని తరలించి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగిలించుకు పోయారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం తో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గజ దొంగ అయ్యారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ ని కోరబోతున్నారు. ఏపీ ప్రాజెక్ట్ లు అపక పోతే మరో ప్రజా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని మంత్రి అన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Ministers who launched double bedroom houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *