పుంగనూరులో సచివాలయాలు ఆదర్శంగా ముస్తాబు

Ministries are ideally located in Punganur

Ministries are ideally located in Punganur

– మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు

Date:16/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న గ్రామ సచివాలయాలు జిల్లాలో ఆదర్శంగా ఉండేలా ముస్తాబౌతున్నాయి. ప్రజలకు ఇంటి వద్ద ప్రభుత్వ సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను అక్టోబర్‌ 2 న ప్రారంభించనున్నారు. ఇందుకోసం పుంగనూరు మున్సిపాలిటిలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ 16 సచివాలయాలను అందరి కంటే ముందుగా సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో 9 ప్రభుత్వ భవనాలలో సచివాలయాలను ఏర్పాటు చేస్తుండగా 7 భవనాలను అద్దెకు తీసుకున్నారు. భవనాలకు నీరు, విద్యుత్‌తో పాటు మరుగుదొడ్లు, ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అనుకూలంగా ఉండే విధంగా భవనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాలకు వైఎస్సార్సీపి పార్టీ రంగులు పైన ఆకుపచ్చ, క్రిందిభాగమున తెలుపు రంగు, కిటికీలకు, ద్వారబందనాలకు నీలం రంగు వేసి అత్యంత సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాలలో ఫర్నిచర్‌, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పుంగనూరు ఆదర్శంగా ఉండేలా ఏర్పాట్లు చేపట్టారు.

స్పందనకు తగ్గిన అర్జీలు

Tags; Ministries are ideally located in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *