Natyam ad

ఉమ్మడి పార్టీలకు మైనార్టీలు దూరంగా ఉండండి

పుంగనూరు ముచ్చట్లు:

బిజెపితోపొత్తు పెట్టుకుని ముస్లిం మైనార్టీల మనుగడకు ముప్పు కలిగించే మత తత్వ ఉమ్మడి అభ్యర్థులకు మైనార్టీలు దూరంగా ఉండి , వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే ఓట్లు వేయాలని సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అర్షద్‌అలి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని నాగపాళ్యెంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో లభ్దిపొందారా లేదా అంటు విచారించారు. అలాగే కౌన్సిలర్లు కమలమ్మ, పద్మావతమ్మ, సాజిదా, సాజిదాబేగం, భారతి, జెపి.యాదవ్‌, కొండవీటి నటరాజ లు వారి వారి వార్డులలో ప్రచారాలు నిర్వహించారు. అలాగే మండలంలోని సింగిరిగుంట గ్రామంలో సర్పంచ్‌ ఆంజప్ప, దళిత నాయకులు రాజు, శంకరప్ప , కృష్ణప్ప, చెన్నరాయుడు, కుమార్‌, బాలాజి, మంజు కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. షరీఫ్‌ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో మైనార్టీలను మోసం చేసేందుకు రకరకాల కుట్రలు పన్నుతారని, వారికి గుణపాఠం నేర్పాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లకు రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Post Midle

Tags: Minorities stay away from joint parties

Post Midle