Natyam ad

మైనారిటీ ఫంక్షన్ హాల్ సమస్యలు పరిష్కరిస్తా

-ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
అసిఫాబాద్ ముచ్చట్లు:
 
ఆసిఫాబాద్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మైనారిటీ నాయకులతో కలిసి మైనారిటీ ఫంక్షన్ హాల్ ను సందర్శించారు. ఫంక్షన్ హాల్ లో ఉన్న సమస్యలు  పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రహరి గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని నాయకులు కోరగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట  పిఆర్ ఏఇ రామ్ కిరణ్ ఎంపిటిసి మల్లేష్, మాజీ ఎంపీపీ బాలేశ్వర గౌడ్, నాయకులు ఆత్రం వినోద్ , కార్తిక్, సిద్దు , అబ్దుల్ ఫయాజ్ , సాజిద్ , సాలం, తరిక్, అబ్దుల్ రహమాన్, అబ్దుల్ హాన్నాన్ , ఖలీద్ బిన్ అవద్ సమీ, జవిద్, సలీం బెగ్ తదితరులు ఉన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Minority function hall solves problems