Natyam ad

పుంగనూరులో మైనారిటీ పథకాలను ప్రచారం చేయాలి- రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్

– 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవం

 

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్రంలోని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీల కోసం ప్రత్యేకించి అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్ ఉర్దూ అకాడమీ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన పుంగనూరులోని ఉర్దూ గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తుందన్నారు. అలాగే ఉర్దూ భాషాభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. గతంలో రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో మాత్రమే ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేస్తుండగా , సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ద్వితీయ అధికార భాషగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈనెల 11న విజయవాడలో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవాడలో జరిగే మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మైనారిటీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం సహా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం , అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల అభివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రెడ్డప్ప విశేష కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో మైనారిటీల సామాజిక అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.12,855 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందని,

 

 

నాన్ డీబీటీ పథకాల ద్వారా మరిన్ని కోట్ల మేరకు ప్రయోజనం కలిగిందన్నారు. అలాగే విద్యారంగంలో అమ్మ ఒడి ద్వారామైనారిటీ విద్యార్థుల తల్లులు 3.06 లక్షల మందికి ఆర్థిక భరోసా, విద్యా దీవెన పథకం ద్వారా 1.83 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మైనారిటీలకు ప్రత్యేకించి రూ.100కోట్లకు పైగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం కలిగిందని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలోనే మైనారిటీలకు ప్రత్యేక గౌరవం, సముచిత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రత్యేకించి మసీదులు, దర్గాలు, పీర్ల చావిళ్లు, ఈద్గాల అభివృద్ధికి ఎంపీ లాడ్స్, సొంత నిధులను కేటాయించి మైనారిటీల సంక్షేమానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. పుంగనూరు లోని ఉర్దూ గ్రంథాలయంలో ఫర్నిచర్, పుస్తకాల కోసం కూడా గతంలో ఎంపీ మిథున్ రెడ్డి రూ. 2లక్షల ఆర్థిక సాయం అందించారన్నారు. రాష్ట్రంలోని మై ముస్లిం మైనారిటీలు సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని, అలాగే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని మైనారిటీలు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటారన్నారు. ఉర్దూ అకాడమీ సిబ్బంది ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. కాగా, స్థానిక ఉర్దూ గ్రంథాలయ సిబ్బంది పనితీరును ఆయన అభినందిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని నసీబ్ జాన్, సిబ్బంది సలీం మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Minority schemes should be promoted in Punganur- State Urdu Academy Director Abdul Kaleem

Post Midle