మైనార్టీలను అణగదొక్కితే తడాఖా చూపిస్తాం- బాబుకు మైనార్టీల హెచ్చరిక
పుంగనూరు ముచ్చట్లు:
ముస్లిం మైనార్టీలను అణగదొక్కేందుకు చంద్రబాబునాయుడు బిజెపితో దోస్తికి తహతహలాడుతున్నాడని , చంద్రబాబుకు తగిన గుణపాఠం నేర్పుతామని ముస్లిం పెద్దలు అజీజ్‌సాహెబ్, ఎంఎస్.సలీం, న్యామతుల్లా, మస్తాన్ లు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన 6 శాతం రిజర్వేషన్‌పై చంద్రబాబు కోర్టుకు వేసి మైనార్టీల రిజర్వేషన్‌ను 4 శాతానికి తగ్గించాడని తెలిపారు. అలాగే బాబు 5 సంవత్సరాల పాలనలో మైనార్టీలకు ఎలాంటి రాజకీయ పదవులు కేటాయించలేదని ఆరోపించారు. కేంద్రం హ్గం మంత్రి అమీత్‌షా ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని బహిరంగ ప్రకటనలు ఇస్తున్నాడని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లింలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతమన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం మతతత్వాన్ని రుజువు చేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేందుకు బిజెపితో చంద్రబాబు దోస్తికి సిద్దమౌతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీచరాజకీయాలకు దిగజారీ మైనార్టీలను మోసగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను మైనార్టీలు నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మైనార్టీల అభివృద్ధిని అడ్డుకునే చంద్రబాబుతో సహా కలిసే పార్టీలను ముస్లింలు ఏకమై భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించి, అనేక పదవులను ఇచ్చి మైనార్టీలను గౌరవించారని కొనియాడారు. ముస్లింలు అందరు ఐకమత్యంతో వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు.

Tags: Minority’s warning to Babu if we undermine the minorities
