Natyam ad

మిర్చి..మహా ఘూటు గురూ

గుంటూరు ముచ్చట్లు:

మిర్చి ధరల పెరుగుదల గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది. గుంటూరు మిర్చి యార్డులో గురువారం రికార్డు స్థాయిలో కొన్ని రకాల మిర్చి ధరలు పెరిగాయి. 2043 బాడిగ రకం మిర్చి క్వింటాలు రూ.33 వేలు పలికింది. గత నాలుగేళ్లలో ఇంత ధర ఎప్పుడూ లభించలేదని వ్యాపార వర్గాలు తెలిపాయి. వేసవి సెలవులకు ముందు రూ.18 వేలులోపు పలికిన వివిధ రకాల మిర్చి ధరలు సీజన్‌ ముగిసిన తరువాత భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో గరిష్టంగా క్వింటాలు రూ. 29 వేల నుంచి రూ.33 వేల వరకు పలుకుతున్నాయి. అయితే, ధరల పెరుగుదల వల్ల వ్యాపారులకు, దళారులకు తప్ప రైతులకు కలిగే ప్రయోజనం స్వల్పంగా ఉంది. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌, స్వీడన్‌ తదితర దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. దీంతో, ధర పెరిగింది. ఇప్పటి వరకు మిర్చిని నిల్వ చేసిన వ్యాపారులకు బాగా కలసి వచ్చింది. వేసవి సెలవులకు ముందు వచ్చిన ధరల కన్నా ఇప్పుడు క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధిక ధరలు లభిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన వ్యాపారులు, కొంతమంది రైతులకు ఇప్పుడు బాగా లబ్ధిపొందుతున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కోల్డ్‌ స్టోరేజిల్లో ప్రస్తుతం 40 లక్షల వరకు మిర్చి టిక్కిలు నిల్వ ఉన్నాయి. ఇందులో 30 లక్షల టిక్కిలు వ్యాపారులకు, మిగిలినవి రైతులకు సంబంధించినవని సమాచారం. రైతులకు వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టే వ్యాపారులు ముందస్తు అవగాహన కుదుర్చుకుని రైతుల పేరున కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేయడం పరిపాటిగా మారింది.

 

 

 

Post Midle

నాన్‌ ఎసి కామన్‌ వెరయిటీ సగటు ధర క్వింటాలు గరిష్టంగా రూ. 25,500 వేలు పలికింది. నాన్‌ ఎసి స్పెషల్‌ వెరయిటీ సగటు ధర రూ.26 వేలు వచ్చింది. ఎసి కామన్‌ వెరయిటీ గరిష్ట ధర రూ.25,500 పలికింది. ఎసి స్పెషల్‌ వెరయిటీకి క్వింటాలుకు రూ.25 వేలు ధర వచ్చింది. మిర్చిలో అత్యధిక డిమాండ్‌ ఉన్న తేజ, బాడిగ రకాలు రాష్ట్రంలో పండిన వాటికి మాత్రం క్వింటాలు రూ.30 వేల నుంచి రూ.33వేల వరకు పలికినట్టు ప్రముఖ మిర్చి వ్యాపారి పులగం సురేష్‌ రెడ్డి తెలిపారు. 355 బాడిగ రకం మిర్చి గరిష్టంగా రూ.29,500 వేలు పలకగా, 341 బెస్టు రకం క్వింటాలు రూ.29,000కు కొనుగోలు చేశారు. 2043 బాడిగ రకం మిర్చికి రూ.33 వేలు, సీజెంటా బేడిగ రకం మిర్చికి రూ.29 వేలు వరకు ధర లభించింది. నెంబరు 5 డీలక్స్‌ రకానికి రూ.27,500, దేవనారు డీలక్స్‌ రకం రూ.28,500 ధర వచ్చింది. తామర తెగులు తట్టుకుని నిలదొక్కుకున్న మిర్చి వెరయిటీలు గత రెండు నెలల క్రితమే యార్డుకు వచ్చాయి. రైతుల వద్ద గరిష్టంగా క్వింటాలు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు పైగా విక్రయించుకుంటున్నారు. గుంటూరు మార్కెట్లో రిటైల్‌ ధర కిలో రూ.275 నుంచి రూ.350 వరకు పలుకుతోంది.

 

Tags: Mirchi..Maha Ghootu Guru

Post Midle