15 వేలు చేరువలో మిర్చి

Date:17/08/2019

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ రకం మిర్చి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. పాటలో రికార్డు స్థాయిలో క్వింటాకు ఒక్కంటికి రూ 14, 700 ధర నిర్ణయించి పంటను మిర్చీ ఖరీదుదారులు కొనుగోలు చేయడం విశేషం. ఇంతకాలం శీతల గిడ్డంగులలో నిల్వ ఉంచుకున్న రైతులు, వ్యాపారులకు కలిసి వచ్చినైట్లెంది. గత  శుక్రవారం జరిగిన జెండాపాటలోఇదే మార్కెట్లో ఏసీ రకం మిర్చి పంటకు క్వింటాకు క్కంటికి రూ 13,800 ధర నిర్ణయించి ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు. మూడు రోజుల సెలవుల అనంతరం క్వింటాకు ఒక్కంటికి రూ 900 ధర పెరిగినైట్లెంది.

 

 

 

సీజన్ ఆరంభంలో ఇదే రకం పంటకు క్వింటా ఒక్కంటికి గరిష్ట ధర రూ 9,500 పలుకగా, ఏకంగా క్వింటాకు రూ 14,700వేల పైచిలుకు పెరగడంతో అటు అధికారులతో పాటు, ఇటు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉండటం అవసరమైన మేర పంట ఉత్పత్తులు లేక పోవడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అని వ్యాపారులు పేర్కొంటున్నారు. సీజన్ ఆరంభంలో కొందరు రైతులు మార్కెట్ల పంటను విక్రయించుకోగా, మరికొందరు రైతులు భవిష్యత్‌లో మరింత ధర పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో కోల్డ్‌స్టోరేజీలలో పంటను నిల్వ ఉంచుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట మార్కెట్‌కు రాకపోవడం, అంతరాజతీయ మార్కెట్లో డిమాండ్ పెరడంతో తిరిగి రైతులు నిల్వ ఉంచిన పంటను అమ్ముకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నా రు.

 

 

 

ఉదయం మార్కెట్లో జరిగిన జెండాపాటలో ఏసీ రకం మిర్చికి గరిష్ట ధర క్వింటాకు రూ 14,700 పలికింది. కనిష్ట ధర రూ 9వేలు కాగా, మధ్య ధర రూ 12,500 చొప్పున పలికింది. తాలు రకం పంటకు క్వింటాకు రూ 4వేలు పలికింది, కనిష్ట ధర రూ 3వేలు కాగా, మధ్య ధర క్వింటాకు ఒక్కంటికి రూ 3,500 చొప్పున ధర నిర్ణయించి ఖరీదు దారులు కొనుగోలు చేశారు. పత్తి పంటకు సైతం మంచి ధర వచ్చింది. ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పత్తి ఖరీదుదారులు క్వింటాకు గరిష్ట ధర 5,775 పెట్టి కొనుగోలు చేశారు. కనిష్ట ధర రూ 5,200 కాగా, మధ్య ధర రూ 5,725 చొప్పున పలికింది.

 

 

 

మక్క పంటకు క్వింటాకు ఒక్కంటికి గరిష్ట ధర రూ 2,200 పలుకగా, కందికి గరిష్ట ధర రూ 5,200, పెసర పంటకు క్వింటా ఒక్కంటికి గరిష్ట ధర రూ 5,500 చొప్పున పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం తేజారకం పంటకు మంచి డిమాండ్ ఉండటంతో స్థానిక ఖరీదుదారులతో పాటు మహారాష్ట, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీకి చెందిన వ్యాపారులు వారి అనుచరుల ద్వార పంటను కొనుగోలు చేస్తున్నారు.

జనగణమన శత వేడుకలు

Tags: Mirchi near 15 finger

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *