ఎర్రగడ్డలో మిర్యాలగూడ ఘటన

Miregalguda event

Miregalguda event

Date:19/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
మిర్యాలగూడలో ప్రణయ్ ఉదంతం ఇంకా మరువకముందే హైదరాబాద్ లో మరో ఘటన జరిగింది. సనత్ నగర్ సమీపంలోని బోరబండ కు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన నవదీప్ నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి వివాహాన్ని  మాధవి తండ్రి  అంగీకరించలేదు. నవదీప్, మాధవిలపై కక్షతో పెంచుకున్నాడు.  బుధవారం నాడు వారిద్దరూ  ఎర్రగడ్డ రోడ్డు  పైన ఉన్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన మాధవి తండ్రి వారిద్దరిపై  కత్తితో దాడి చేసి పారిపోయాడు.
తీవ్రగాయలైన ఇద్దరిని పోలీసులు సనత్ నగర్  నీలిమా ఆసుపత్రికి  తరలించారు.  మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద హాస్పిటల్ కి తరలించారు.
Tags:Miregalguda event

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *