మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం

Date:26/10/2020

ల‌క్నోముచ్చట్లు

అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమయ్యే మీర్జాపూర్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. పచ్చి బూతులు, హింస, అడల్డ్ కంటెంట్‌తో రూపొందించిన ఆ సిరీస్‌ అంటే యూత్‌లో పిచ్చ క్రేజ్! గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ బహుశా ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్. ఈ సిరీస్ ఎంత హిట్ అంటే మీర్జాపూర్ 2 పేరుతో స్వీక్వెల్ కూడా తీసేశారు. ఇటీవలే మీర్జాపూర్ 2 సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది.ఈ తరుణంలో ఈ సిరీస్‌ను బ్యాన్‌ చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నియోజకవర్గ అప్నాదల్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనుప్రియా పటేల్‌ డిమాండ్‌ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని ఆమె ఆరోపించారు. మీర్జాపూర్‌ను ఓ హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ దాని పేరు చెడగొడుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌ నాయకత్వంలో మీర్జాపూర్‌ ప్రాంతం ప్రశాంతంగా ఉందన్నారు.

 

 

ఈ వెబ్‌ సిరీస్‌ విషయంపై తప్పక విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షమైన అప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి వర్గంలో కూడా పని చేశారు. దీంతో ఈ వివాదం దేనికి దారితీస్తుందో అని మీర్జాపూర్ సిరీస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.అనుప్రియా పటేల్గ్యాంగ్‌ వార్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ మీర్జాపూర్‌. దీనికి కొనసాగింపుగా ఈ నెల 23న అమెజాన్‌ ప్రైమ్‌లో మీర్జాపూర్‌ 2 విడుదలైంది. అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌, విజయ్‌ వర్మ, ప్రియన్షూ పేన్యూలీ, ఇషా తల్వార్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు దర్శకత్వం వహించారు.

 

Tags: Mirzapur web series controversy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *