ప్లే బాయ్ మ్యాగజైన్ పై మిస్ ఇండియా

Miss India on Playboy Magazine

Miss India on Playboy Magazine

Date:18/2019

ముంబై ముచ్చట్లు:

సాధారణంగా అందాల పోటీల్లో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ గురించి చాలా మందికి తెలుసు. కానీ, మిస్ ఇండియా బికిని, మిస్ గ్లామర్ ఫేస్ వరల్డ్, వరల్డ్ స్విమ్‌సూట్ మోడల్ వంటి అందాల పోటీలు ఉన్నాయని మీకు తెలుసా? అందులోనూ ఇలాంటి పోటీల్లో భారత్‌కు చెందిన ఒకమ్మాయి బాగా ఫేమస్ అని తెలుసా? బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే, ఈ మరాఠ మోడల్, నటిని మీకు పరిచయం చేస్తున్నాం.మోడల్ నుంచి నటిగా మారిన నికితా గోఖలే మిస్ ఇండియా బికిని 2015 విజేత. భారత్ తరఫున అంతర్జాతీయ వేదికపై కూడా పోటీపడింది ఈమె. మిస్ వరల్డ్ బికిని 2015 పోటీల్లో భారత్ తరఫున పాల్గొంది. ఆ తరవాత చాలా అంతర్జాతీయ అందాల పోటీల్లో మెరిసింది. అయితే, ప్రస్తుతం ఈ బ్లాక్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో సెగలు పెట్టిస్తోంది. దానికి కారణం ఆమె ఫొటోషూట్స్. అంత బోల్డ్‌గా ఉంటాయి మరి. తన శరీర సౌష్టవాన్ని చూపించడానికి అస్సలు సిగ్గుపడదు నికిత.ప్రపంచ ప్రఖ్యాత ప్లేబాయ్ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌పై నగ్నంగా కనిపించి పాపులర్ అయ్యింది నికిత.

 

 

 

 

 

 

 

 

ఆ తరవాత ఇంటర్నెట్‌లో సెన్సేషనల్ ఫొటోలతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన నికిత (అసలు పేరు దుర్గా శివశంకర్ గోఖలే) 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్ కెరీర్‌ను మొదలుపెట్టింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నికిత మోడల్ కాకముందు ఒక కంపెనీకి ఫైనాన్సియల్ అడ్వైజర్‌గా కూడా పనిచేసింది. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన తరవాత నాగ్‌పూర్‌లో సొంతంగా స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీని ప్రారంభించింది. ప్రస్తుతం ఆ కంపెనీని ఆమె సోదరుడు నడిపిస్తున్నారు.నికిత 2016లో మిస్ గ్లామర్ ఫేస్ వరల్డ్ కాంపిటీషన్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తరవాత వరల్డ్ స్విమ్‌సూట్ మోడల్ 2017 కాంపిటీషన్‌లో కూడా పాల్గొంది. ఫైనల్ వరకు వెళ్లింది. మోడలింగ్‌తో పాటు సినిమాల్లోకి ప్రవేశించింది నికిత. 2015లో మరాఠి సినిమా ‘కాలేజ్’ ద్వారా వెండితెరకు పరిచయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నికిత ఎప్పటికప్పుడు తన న్యూడ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది.

 

లోకేష్ పై విమర్శలెందుకు?

 

Tags:Miss India on Playboy Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *