లారీలో మంటలు…తప్పిన ప్రమాదం

Date:21/01/2021

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం బైపాస్ రోడ్ విశాల్ మర్ట్ సమీపంలో ఒక  లారీ ఇంజన్లో  మంటలు చెలరేగాయి. షాట్ సర్కుట్  తో ఆగ్ని ప్రమాదం వాటిల్లిందని అనుమానిస్తున్నారు,. మంటలు రాగానే లారీ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దాంతో ప్రమాదం  తప్పింది.  ఖమ్మం నుండి సత్తుపల్లి ఎరువుల లోడ్ తో వెళుతున్న  ఏపీ 16 టీవై 8859 లారీ  నగరంలోని విశాల్ మార్ట్ సమీపంలోకి  రాగానే  అకస్మాత్తుగా ఇంజన్ లో షాట్ షర్కుట్ వల్ల మంటలు చెలరేగాయి. డ్రైవర్ చక్రధర్ రెడ్డి  వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులుకు సమాచారమిచ్చాడు. ఫైర్  సిబ్బంది  సకాలంలో స్పందించి  మంటలను ఆర్పింది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: Missed risk of fire in lorry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *