ఈటలకు తప్పిన ముప్పు

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
ఢిల్లీ నుంచి వస్తున్నమాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఈటల వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.విమానం టేకాఫ్ అయ్యేప్ సమయంలో రన్ వే పై సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అది గుర్తించిన పైలెట్…. అప్రమత్తం అయ్యాడు. గాల్లోకి లేచే టైంలో అలెర్ట్ అయి సంకేతిక సమస్యను ఫైలెట్ గుర్తించాడు.దీంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఈటెల రాజేంద్ర బృందం బయలుదేరింది.మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు విమానంలో మొత్తం 184 మంది ఉన్నారు. మరోవైపుఈరోజు హైదరాబాద్ చేరుకున్న తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి మొదటసారి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. ముఖ్యనేతలతో మాజీమంత్రి ఈటల సమావేశంకానున్నారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Missed threat to yards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *