అస్సోంలో 19 లక్షల మిస్సింగ్

Date:31/08/2019

గౌహతి ముచ్చట్లు:

అస్సాం రాష్ట్రానికి చెందిన పౌర‌స‌త్వ తుది జాబితాను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ జాబితాలో సుమారు 19.06 ల‌క్ష‌ల మందిని పౌర‌స‌త్వం నుంచి తొల‌గించారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి అవ‌కాశం క‌ల్పించారు. గ‌త ఏడాది ఎన్ఆర్‌సీ ముసాయిదాను త‌యారు చేశారు. ఆ జాబితాలో సుమారు 40 ల‌క్ష‌ల మందిని వ‌దిలేశారు. ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన లిస్టులో పౌరుల జాబితా మొత్తం ఉంది. లిస్టును పోస్టు చేసిన ప్ర‌భుత్వ వెబ్‌సైట్ ప్ర‌స్తుతం ప‌నిచేయ‌డం లేదు. సైట్ క్రాష్ అయిన‌ట్లు తెలుస్తోంది. అత్యంత వివాదాస్ప‌దంగా మారిన అస్సాంలోని ఎన్ఆర్‌సీ జాబితాను ఉద‌యం 10 గంట‌ల‌కు వెళ్ల‌డించ‌నున్న‌ట్లు ముందే చెప్పారు.

 

 

 

దాని ప్ర‌కార‌మే జాబితాను రిలీజ్ చేశారు.ఎన్ఆర్‌సీ లిస్టు రిలీజ్ నేప‌థ్యంలో అస్సాంలో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేలాది మంది పారామిలిట‌రీ ద‌ళాలు ప‌హారా కాస్తున్నాయి. అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌ను ఎన్ఆర్‌సీ జాబితా నుంచి తొల‌గించాల‌ని కేంద్రం ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే నిజ‌మైన పౌరుల‌ను ఆదుకుంటామ‌ని ఆ రాష్ట్ర సీఎం శ‌ర‌బానంద సోనోవాల్ తెలిపారు. జాబితాలో పేరు లేనంత మాత్రాన విదేశీయులు కార‌ని, వాళ్లు ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించ వ‌చ్చు అని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు సాధార‌ణంగానే ఉన్న‌ట్లు డీజీపీ కులాధార్ సైకియా తెలిపారు.

 

 

 

 

తొలిసారిగా 1951లో వెల్లడించిన ఎన్ఆర్సీకి గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మార్పులు చేర్పులు చేపట్టారు. అసోంలోని అక్రమవలసదారులెవరో? అసలు భారతీయులెవరో తేల్చేడమే ఎన్ఆర్సీ ముఖ్యోద్దేశం. కాగా, శనివారం నాడు అనుబంధ జాబితా వెల్లడించిగా.. గతంలో ఎన్ఆర్సీ ముసాయిదాలో పేర్లు గల్లంతైనవారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వారిని ఇందులో చేర్చారు. అంతేకాదు, ముసాయిదాలో పేరు లేనివారు తగిన ఆధారాలతో విచారణకు హాజరుకావాలని జూలై 5న ఆదేశించారు. కాగా, 2017, 2018లో ముసాయిదా ప్రచురించిన రెండు సందర్భాల్లో పలువురు పేర్లు గల్లంతయ్యాయి.

 

 

 

 

ఇప్పటి వరకు జాబితాలో ఉన్న 3,34,54,384 మంది దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సెప్టెంబరు 7 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్ఆర్సీ అధికారులు తెలిపారు. ఎన్ఆర్సీ కచ్చితత్వంపై సాధారణ ప్రజానీకం, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం సాయం కోరింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మోహరించిన అదనపు బలగాలను ఇక్కడకు తరలించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లుచేసింది. గతేడాది జులై 31న ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదా ప్రకారం 2,89,83,677 మంది ఉండగా, 40,70,707 మందిని అనర్హులుగా తెలిపింది.

 

 

 

 

 

కానీ, ఈ ఏడాది జూన్ 26 మరో 1,02,462 మందిని అనర్హులుగా పేర్కొన్నారు. విదేశీయులు, అనుమానాస్పద ఓటర్లు, పెండింగ్ కేసులు ఉన్నవారు ఇందులో ఉన్నారు. జూలై 5 తర్వాత విచారణకు పిలవనివారు ఎన్ఆర్సీలో తమ పేరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తుది ఎన్‌ఆర్‌సి నుంచి మినహాయించడం అంటే ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించడం కాదని, అవసరమైతే దీనిపై విదేశీయుల ట్రైబ్యునల్స్, హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశాలు ఉంటాయి. కోర్టు ఉత్తర్వులతో ఎన్ఆర్సీలో చేర్పులు ఉంటాయి. కాగా, అసోంలో అదనంగా 200 విదేశీయుల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరించింది.

 

 

 

 

ఎన్ఆర్సీలో అనర్హులుగా ప్రకటించిన వారు ఆర్జీలపై వచ్చే నెలలో ఇవి విచారణ చేపడతాయి. తుది జాబితాలో పెద్ద సంఖ్యలో భారతీయులను అనర్హులుగా పేర్కొంటారని రాజకీయ పార్టీలు ఆరోపించడంతో ప్రస్తుతం ఇది రాజకీరంగు సంతరించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, సహా పాలక బిజెపి లాంటి ప్రధాన పార్టీలు ఇది ఓ తప్పుల తడకని వ్యాఖ్యానించాయి.

 

 

 

 

 

 

ఎన్ఆర్సీలో పేర్లు దక్కనివారిలో ఎక్కువ భాగం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులేనని బిజెపి భయపడుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కేంద్ర హోం శాఖ ఆగష్టు 20న వెల్లడించిన నోటిఫికేషన్‌లో తుది ఎన్ఆర్సీ జాబితాలో ఒక వ్యక్తి పేరును చేర్చకపోవడం వారిని విదేశీయుడిగా ప్రకటించడం కాదని పేర్కొనడమే దీనికి నిదర్శనమని అంటున్నారు.

సాహో కలెక్షన్స్ అధరహో

Tags: Missing 19 lakhs in Assam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *