మిషన్ 100

Date:20/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో ఊపు మీదున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే కేంద్రనాయకత్వం ఆదేశించింది. ఇటీవల రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ కూడా మిషన్ 100 పైనే చర్చించినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రణాళికను రూపొందించారు.ప్రణాళికలో భాగంగా మొదట కాంగ్రెస్ ను మరింత బలహీనపర్చడం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలవకుండా నివారించగలిగితే ఆ పార్టీ మరింత బలహీన పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ ను సాగర్ ఉప ఎన్నికల్లోనూ గట్టి దెబ్బ కొట్టాలని బీజేపీ పథక రచన చేస్తుంది. తమ టార్గెట్ టీఆర్ఎస్ కాదని, కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.దీనివల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద యెత్తున వలసలు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అనేక మంది నేతలు వచ్చారు.

 

 

అయినా 117 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకత్వం లేదు. దానికి చేరికలతో పూడ్చాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. అందుకే సాగర్ ఉప ఎన్నికల్లో తమ గెలుపు కన్నా కాంగ్రెస్ ఓటమి కోసమే ఎక్కువగా బీజేపీ ప్రయత్నించనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కాంగ్రెస్ ను వీక్ చేయాలని భావిస్తుంది.దీంతో పాటు అధికార టీఆర్ఎస్ పైన కూడా మరింత దూకుడుగా ఉద్యమించాలని నిర్ణయించింది. సాగర్ ఉప ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చి టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలన్న యోచనలో ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసే అవకాశాలున్నాయి. కేసీఆర్ కుటుంబంపైనా, ప్రభుత్వ వైఫల్యాలనే అజెండాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.

ముద్రగడకు రాజ్యసభ ఆఫర్

Tags: Mission 100

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *