మిషన్‌ ఇంధ్ర ధనస్సు ప్రారంభం

Mission is the beginning of the iron money

Mission is the beginning of the iron money

Date:16/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

మిషన్‌- ఇంధ్ర ధనస్సు కార్యక్రమాన్ని మడిబాపనపల్లె పిహెచ్‌సి కార్యాలయంలో సోమవారం డాక్టర్‌ పవన్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్‌ ఇంధ్ర ధనస్సు కార్యక్రమాన్ని మూడ విడతలుగా చేపడుతామన్నారు. ఇందులో తొలి విడతగా జూలై నెలలో , రెండవ నెల ఆగస్టు, మూడవ విడత సెఫ్టెంబర్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణి లకు, చిన్న పిల్లలకు, ఇటుక బట్టిలలో పని చేసే మహిళా కార్మికులకు, వలస వచ్చిన మహిళా కార్మికులను గుర్తించి, వారికి అన్ని రకాల వైద్య సేవలు అందించి, ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవసరమైన చికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత ం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు, వైద్య సిబ్బంది వెంకట్రామయ్య, సురేంద్రబాబు, హరిప్రసాద్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

 

మిషన్‌ ఇంధ్ర ధనస్సు ప్రారంభంhttps://www.telugumuchatlu.com/mission-is-the-beginning-of-the-iron-money/

Tags; Mission is the beginning of the iron money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *