మిషన్ కశ్మీర్

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించేందుకు ఆ ప్రాంతానికి చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 8 రాజకీయ పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి జరుగుతున్న అఖిలపక్ష భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్‌ మెహబూబా కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్‌ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు.

 

 

 

 

కశ్మీర్‌కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది.  ప్రధానితో కశ్మీర్‌ నేతల సమావేశం నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కేంద్రం మరింతగా పెంచింది. 48 గంటలు హై అలర్ట్‌ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కేంద్రం  భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్‌ను కూడా కట్‌ చేసే అవకాశాలున్నాయి. భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Mission Kashmir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *