శాసనమండలి ఎన్నికల్లో అధికారపార్టీ దుర్వినియోగం- బిజెపి నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో అధికార పార్టీ చట్టాన్ని చుట్టంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతోందని బిజెపి రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సాయంత్రం శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు , జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డితో కలసి పార్టీ నాయకులతో సమావేశాన్ని విష్ణువర్ధన్‌రెడ్డి నిర్వహించారు. శాసనమండలి ఎన్నికలు సక్రమంగా నిర్వహించేలా బిజెపి నాయకులు అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. అలాగే శాసనమండలి ఎన్నికల కమిషన్ చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిని బిజెపి ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే లానేస్తం పేరుతో పట్టభద్రుల ఓట్లు ప్రభావితం చేసేందుకు లభ్దిదారులైన ఓటర్ల ఖాతాకు డబ్బులు వేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం ఎన్నికల రోజు పోలీసుల దెహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిందని , దీనిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలలో నిరుద్యోగులు ఓట్లు వేయరన్న భయంతో ప్రభుత్వం పోలీంగ్‌కు దూరం చేసేందుకే ఈ దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తోందని, దీనిని రద్దు చేయాలన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ ఈ విషయంలో వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ పనితీరు సక్రమంగా లేదని ,దీనిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజారెడ్డి, అయూబ్‌ఖాన్, రాజాజెట్టి, గణేష్, టివిఎస్.ప్రసాద్, నానబాలగణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Misuse of the ruling party in the legislative assembly election- BJP leader Vishnuvardhan Reddy
