25న మిధునన్న వస్తున్నాడు- కౌన్సిలర్లకు షాక్‌

పుంగనూరు ముచ్చట్లు:

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి ఈనెల 25 ఆదివారం పుంగనూరు ప్రజలతో గడపనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్దిన్‌షరీఫ్‌, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగభూషణం మాట్లాడుతూ ఎంపీ మిధున్‌రెడ్డి ఉదయం నుంచి మున్సిపల్‌ కార్యాలయంలో ఉంటు , ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే మున్సిపాలిటిలోని 31 వార్డులలోని సమస్యలను ఆయా కౌన్సిలర్ల ద్వారా అడిగి తెలుసుకుని పరిష్కరించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో చేపట్టనున్న వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ సమీక్ష నిర్వహించనున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్లు సిఆర్‌.లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, నటరాజ, నరసింహులు, కాళిదాసు, జెపి.యాదవ్‌, రేష్మా, రెడ్డెమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలిఅహమ్మద్‌, మహబూబ్‌బాషా, ఖాదర్‌బాషా, కిషోర్‌, రాజేష్‌, సురేష్‌, బండకుమార్‌, అస్లాం మురాధి తదితరులు పాల్గొన్నారు.

– కౌన్సిలర్లకు షాక్‌

మున్సిపాలిటిలో కౌన్సిలర్లు కొంత మంది వార్డులలో పర్యటించకుండ, ప్రజలతో మమేకంకాకుండ నిర్లక్ష్యం వహించడంపై ఎంపీ మిధున్‌రెడ్డి ఈ విషయాలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో ఎంపీ మిధున్‌రెడ్డి పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన వివిధ రకాల విషయాలపై కౌన్సిలర్ల సమీక్షలో గట్టిగా హెచ్చరికలు చేశారు. కౌన్సిలర్లు వార్డులలో పర్యటించకపోతే ఇన్‌చార్జ్లను నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాలపై మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌ ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయడం, ఎంపీ ఉన్న పలంగా ఆదివారం మున్సిపాలిటిలో గడుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎంపీ రాక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కూడ ఎంపీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఎంపీ పర్యటన సందర్భంగా పలువురు కౌన్సిలర్లు, నాయకుల పనితీరుపై చర్చ ఉంటుందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

 

 

 

 

Tags: Mithunanna is coming on 25th – a shock to the councillors

Leave A Reply

Your email address will not be published.