గృహ నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆనం

నెల్లూరు   ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా  వెంకటగిరి లో డాక్టర్ వై ఎస్ ఆర్ మెగా లేపుట్ నందు గృహ నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు.
నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో – గురువారం వెంకటగిరి నందు గల వైయస్సార్ కాలనీ లకు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందదాయకం అన్నారు. పేద వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు డాక్టర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కి వైయస్సార్ మెగా లేఅవుట్లో నిర్మించబడుతున్న వైయస్సార్ కాలనీలో సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ నక్కా భానుప్రియ, కౌన్సిలర్లు పలువురు నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:MLA Anam, who laid the foundation stone for the housing project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *