అక్రమ మైనింగ్ పై చర్చకు సిద్దం-ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ముచ్చట్లు:
సైదాపురం మండలం లో అక్రమ మైనింగ్ పై గత నాలుగు రోజుల నుంచి ఈనాడు మరియు పలు పత్రికల్లో వైసిపి ప్రభుత్వంపై వచ్చిన కథనాలను నెల్లూరు నగర్ శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్
ఖండించారు. సైదాపురంలో అక్రమ మైనింగ్ చేస్తున్నది టిడిపి నాయకులే దీనిపై నేను ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను. అక్రమ మైనింగ్ జరగుతుంది సగం పైగా టిడిపి సర్పంచులున్నటువంటి
గ్రామాలే. గత ఆరు నెలల నుంచి ఈ అక్రమాలు అధికమయ్యాయి. రామ్ కుమార్ రెడ్డి గారు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఇక్కడ నుంచి కూడా వెళ్ళి టిడిపి నాయకులతో అక్రమ మైనింగ్
చేస్తున్నారు. అక్రమ మైనింగ్ కి మరియు టిడిపి నాయకులుకి రాపూర్ సిఐ మరియు స్థానిక ఎమ్మార్వో పూర్తిగా సహకరిస్తున్నారు దీనిపై పూర్తి ఆధారాలతో త్వరలో సీఎం ని కూడా కలుస్తున్నానని అన్నారు.
అత్యధికంగా జోగిపల్లి మండలం జయలక్ష్మి మైనింగ్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ చేస్తున్నది. టిడిపి పార్టీకి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మైన్స్ లో 10 సంవత్సరాల క్రితమే లైసెన్స్ అయిపోయినా
కూడా మెటీరియల్ తరలిస్తున్నారు. అది అడ్డుకున్నది వైఎస్ఆర్సిపి నాయకుడు. ఏదైనా రైతు పొలం లో వాలకి అక్రమ మైనింగ్ కి ఇవ్వకపోతే వాళ్లని రాపూర్ సిఐ మరియు ఎమ్మార్వో భయబ్రాంతులకు
గురిచేసి అక్రమ కేసులు పెడతామంటూ మాట్లాడుతున్నారు. కొంత మంది వైఎస్ఆర్సీపీ నాయకులు నీ కలుపుకొని అక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ అందరిని బెదిరింపులు చేస్తుండొచ్చు మీకు భాగం టిడిపి
నాయకులు అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తాను. నా నియోజకవర్గ కాకపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నెల్లూరు జిల్లాలో
భాగంగాబట్టి దీనిపై పార్టీకి చెడ్డపేరు రాకూడదు కాబట్టి కచ్చితంగా నేను దీనిపైన నిలబడి ఉంటాను. రాపూర్ సిఐ స్థానిక ఎమ్మార్వో అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వారికి పూర్తి సహాయ సహకారాలు
అందిస్తున్నారు.

Tags:MLA Anil Kumar Yadav ready for discussion on illegal mining
