Natyam ad

నూతన సచివాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి నగరంలో నూతనంగ నిర్మించిన రెండు సచివాలయాలను మంగళవారం టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ 27వ డివిజన్ కి సంబందించిన రెండు సచివాలయాలను మల్లయ్యగుంట కట్ట వద్ద 62.70 లక్షలతో నిర్మించడం జరిగిందని, అదేవిధంగా 44వ డివిజన్ రైల్వే కాలనీ వద్ద 25 లక్షలతో నిర్మించిన మరో నూతన సచివాలయమును కూడా ప్రారంభించడం జరిందన్నారు. ప్రజా అవసరాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మునిసిపల్ కార్పొరేషన్ తగు చర్యలు తీసుకుంట్టున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ, కార్పొరేటర్ తిరుపతి మునిరామిరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ముడూరు మునిరామిరెడ్డి, జల్లి తులసీ యాదవ్, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, చింతా రమేష్ యాదవ్, చింతా భరణీ యాదవ్, దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, స్టోర్ నాధముని, దినేష్ రాయల్, శ్యామల, గీత, డిఈలు రాజు, శ్రావణి, కాంట్రాక్టర్లు అరుణ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MLA Bhumana inaugurated the new secretariats

Post Midle