Natyam ad

గడపగడపకు మహా పాదయాత్రలో ఎమ్మెల్యే చెవిరెడ్డి

చంద్రగిరి ముచ్చట్లు :

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. గత మూడు రోజులుగా ఎంపీపీ మోహిత్ రెడ్డి చేస్తున్న మహా పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఆదివారం సాయంత్రం ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

Post Midle

కిడ్నీ బాధితురాలికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చెవిరెడ్డి…

మంగళం క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న నారాయణమ్మ గత కొంత కాలంగా కిడ్నీ పనిచేయక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి స్విమ్స్ ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ రామ్ కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం నారాయణమ్మకు ఆరోగ్య పరంగా మంచి వైద్యం అందుతుందని భయపడవద్దని ధైర్యం చెప్పారు.

హారతులతో స్వాగతం….

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంగళం క్వార్టర్స్ లోని మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి గడపలో హారతి పట్టి ఎమ్మెల్యే చెవిరెడ్డి చేతులు మీదుగా సంక్షేమ పథకాల జాబితాను స్వీకరించారు.

Tags: MLA Chevireddy in the great padayatra to Gadapagadapa

Post Midle

Leave A Reply

Your email address will not be published.