గ్రామీణ లో నెలకొన్న  రెవెన్యూ సమస్యలపై కలెక్టర్తో చర్చించిన ఎమ్మెల్యే .

Date:16/01/2021

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని నెలకొన్న వివిధ రెవెన్యూ సమస్యలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తో శనివారం ఎమ్మెల్యే కోటంరెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం లకు షాదీమంజిల్ కి స్థల కేటాయింపు, 22/A నిషేదిత భూముల రిజిస్ట్రేషన్, చుక్కలభూముల సమస్య,  ఆమంచర్ల ఏపీ ఐ ఐ సి భూముల సమస్య మీద జిల్లా కలెక్టర్ ని కలసి, ప్రత్యేకంగా చర్చించి, సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సంబంధిత సమస్యల పై ఆయా శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పై సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: MLA discusses revenue issues in rural areas with Collector.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *