తిరుపతి ప్రెస్ క్లబ్ కి సొంత స్థలం ఏర్పాటుకు సహకారం అందిస్తా- ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ప్రెస్ క్లబ్ అధునాతన సౌకర్యాలతో ఆధునీకరణకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హామీ. తిరుపతి జిల్లా కేంద్రంలో తప్పక ప్రెస్ క్లబ్ కి సొంత స్థలం ఏర్పాటుకు సహకారం అందిస్తా: ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సొంత స్థలంలో సొంత భవన నిర్మాణానికి నా వ్యక్తిగత నిధుల నుంచి రూ.10 లక్షలు నిధులు అందిస్తాను. చంద్రగిరి నియోజకవర్గంలో జర్నలిస్టులు ముందుకు వస్తే మండలానికో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధునీకరణ, సొంత భవనం నిర్మాణం, స్థలం కేటాయింపు వంటి అంశాలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు విక్రమ్. జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

ఆదివారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీపీ, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులకు నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. మెగా వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు. జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సదుపాయాలు కల్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి బాలచంద్ర, ఉపాధ్యక్షులు విక్రమ్ తదితరులు.
Tags:MLA Dr. Chevireddy Bhaskar Reddy will provide support to Tirupati Press Club in setting up its own place
