ఎన్‌జీవోల అధ్యక్షుడు వరదారెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

MLA Dwarkanatha Reddy honors NGO's president Varadara Reddy

MLA Dwarkanatha Reddy honors NGO's president Varadara Reddy

Date:20/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఐదుసార్లు ఎన్‌జీవోల సంఘ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన జి.వరదారెడ్డిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సన్మానించారు. ఆదివారం పట్టణంలో ఎన్‌జీవోల సంఘ ఎన్నికలను ఏపిఎన్‌జీవోల ఎన్నికల అధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు పరుశురాం, ప్రదీప్‌ కలసి నిర్వహించారు. పుంగనూరు , రామసముద్రం, పెద్దపంజాణి, చౌడేపల్లె, సదుం , సోమల మండలాకు చెందిన ఎన్‌జీవో నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలన్నారు.అందరు ఏకగ్రీవంగా వరదారెడ్డిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ ఎన్‌జీవోల సంఘాన్ని పటిష్ట పరుస్తామన్నారు. త్వరలోనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎన్‌జీవోల భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తనను ఐదవసారి ఏకగ్రీవంగా గెలిపించిన ఎన్‌జీవోలు అందరికి నూతన అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్‌ శివ, వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, తిరుపతి రాధాకృష్ణ, నాగభూషణ్‌రెడ్డి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణుల స్మశాన వాటిక అబివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి హామి

Tags: MLA Dwarkanatha Reddy honors NGO’s president Varadara Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *