Natyam ad

ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

సోమల మండలం అన్నెమ్మగారిపల్లె , పెద్ద ఉప్పరపల్లె పంచాయతీలలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత దుర్గంకొండల్లో వెలసిన గార్గేయ మునీశ్వరస్వామిని దర్శించుకున్నారు. పెద్ద ఉప్పరపల్లె మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సోమల హరిజనవాడలో ఆనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త రంగమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గంగాధరం, నాగభూషణంరెడ్డి, అమాస మోహన్‌, గణపతి, నాగేశ్వరరావు, ప్రభాకర, బెంగళూరు సాంబయ్య, సర్వేశ్వరి , రమణారెడ్డి , రజియా, జిలాని, మస్తాన్‌వలి, షేక్‌బాషా, షావలి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: MLA Dwarkanatha Reddy in door to door campaign

Post Midle