Natyam ad

ప్రాజెక్టుల జోలికొస్తే ఖబడ్డార్‌…- ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆగ్రహం

– ఎన్‌టిఆర్‌ పార్టీ కాదు దమ్ముంటే కొత్తపార్టీ పెట్టు
– పచ్చనాయకులు 7 వేల ఎకరాల ఫారెస్ట్ భూమి కబ్జా
– జగన్‌ ప్రభుత్వంలోనే కుప్పం అభివృద్ధి
– కుప్పంలో బాబు దోపిడి రూ.300 కోట్లు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పడమటి నియోజకవర్గాలకు సాగునీరు-తాగునీరు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లె ప్రాజెక్టులపై చంద్రబాబునాయుడు తప్పుడు కేసులు వేసి స్టే తీసుకురావడంపై తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోమల మండలం ఆవులపల్లె ప్రాజెక్టు వద్ద సాదన సమితి ఆధ్వర్యంలో రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెప్పలు హాజరైయ్యారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌ ను చంపి తెలుగుదేశాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబునాయుడు దమ్ముంటే కొత్తపార్టీ పెట్టి గెలవాలన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా కుప్పం, చిత్తూరు జిల్లాకు ఏమి చేయలేదన్నారు. కుప్పంలో రూ.140 కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టుకు రూ.440 కోట్లు ఖర్చు చేసి రూ.300 కోట్లు దోపిడి చేశారన్నారు. చంద్రగిరిలో గెలవలేక కుప్పంకు వెళ్లాడని ఆరోపించారు. అసెంబ్లిలో భార్యను అడ్డుపెట్టుకుని వెహోసలి కన్నీరు కార్చి మెప్పు పొందేందుకు ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. కుప్పం మున్సిపాలిటి అభివృద్ధికి రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుని రూ.60 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. చవట దద్దమ్మలోకేష్‌తో పాదయాత్ర పేరుతో జాగింగ్‌ చేయడం , సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టించడం, పేపర్‌ చూసి మాట్లాడటం గమనిస్తే లోకేష్‌కు జ్ఞానం ఏమాత్రం లేదనేది తెలుస్తోందన్నారు. అవసరమైతే మేము ట్యూషన్‌ చెప్పి అన్ని నేర్పిస్తామని ఎద్దెవా చేశారు. ప్రాజెక్టులపై కోర్టులకు వేసినా తగిన సాక్షాధారాలు చూపి మేమే గెలుస్తామన్నారు. సోమల మండలంలో 7 వేల ఎకరాలు ఫారెస్ట్ భూమిని రికార్డు మార్చి కబ్జా చేశారని ఆరోపించారు. సీతమ్మ చెరువులో ప్రాజెక్టు నిర్మించి తీరుతామని , దీని ద్వారా పీలేరు, రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం, సోమల మండలాలకు తాగునీరు-సాగునీరు అందిస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన జరిగిందా..? ఉంటే రండి బహిరంగంగా చర్చిద్దాం అని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. అభివృద్ధికి సహకరిస్తే ప్రారంభోత్సవాలలో చంద్రబాబు పేరు వేస్తామని తెలిపారు. లేకపోతే ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఏకిల సంఘ అధ్యక్షుడు మురళిధర్‌, ఎంపీపీలు సురేంద్రరెడ్డి, ఈశ్వరయ్య, గాజుల రామ్మూర్తి, జెడ్పిటిసిలు సోమశేఖర్‌రెడ్డి, దామోదర్‌రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్డీశ్వరరెడ్డి, ఫృద్వీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: MLA Dwarkanatha Reddy is angry about projects…

Post Midle