గుండెపోటుతో ఎమ్మెల్యే అనుచరుడు “మునిరామయ్య” మృతి..!

– భౌతిక కాయాన్ని సందర్శించి బోరున విలపించిన ఎమ్మెల్యే

-ఇప్పతంగళ్ లో విషాదఛాయలు

Date:09/08/2020

సత్యవేడు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి అత్యంత సన్నిహిత అనుచరుడు, వైసీపీ నేత ,నారాయణవనం మండలం కసింమిట్ట పంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ “మునిరామయ్య”
ఆదివారం హటాత్తుగా గుండెపోటుతో నారాయణవనం మండలంలోని ఇప్పతంగళ్ గ్రామంలోని స్వగృహంలో మృతి చెందారు.. “మునిరామయ్య” మరణవార్త తెలియగానే ఎమ్మెల్యే హుటాహుటిన ఇప్పతంగళ్ కు బయల్దేరివెళ్లారు .అక్కడ “మునిరామయ్య” భౌతికకాయాన్ని చూడగానే ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనై బోరున విలపించారు.. ఎమ్మెల్యే కన్నీరు పెడుతూ ఉంటే చూసిన చుపరులు కళ్ళు సైతం చెమ్మగిల్లాయి.30 సంవత్సరాలుగా తనతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, కష్టసుఖాల్లో వెన్నంటి ఉండి పార్టీ అభివృద్ధితో పాటు తన రాజకీయ ఎదుగుదలలో పక్కనే ఉన్న మంచి మిత్రుడు నీ కోల్పోవడం తనను ఎంతగానో కలిచివేసిందనీ ఎమ్మెల్యే నిర్వేదం వ్యక్తం చేశారు. దళిత నాయకుడిగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములలో ప్రముఖ పాత్ర పోషించే, విశ్వనాధ నాయకుడు మిత్రుని కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు.

స్వర్ణ పాలెస్ ఘటనపై కేసు నమోదు

Tags: MLA follower “Muniramayya” dies of heart attack ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *