Natyam ad

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గాధరి కిషోర్

తుంగతుర్తి ముచ్చట్లు:


హైదరాబాద్ కుషాయిగూడ లోని అగ్ని ప్రమాద ఘటనలో మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేశ్(35), సుమ(28), జోషిత్(5) ఒకే కుటుంబంలోని ముగ్గురు అగ్నికీలలకు బలైపోయారు. స్థానిక ఎమ్మెల్యే గాధరి కిషోర్ కుమార్ మంగళవారం మృతుల  నివాసానికి వెళ్లి  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి.. తక్షణ సాయంగా యాభై వేల రూపాయలు  అందజేశారు. భవిష్యత్తులోనూ  బాధిత కుటుంబానికి నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

 

Tags; MLA Gadhari Kishore visited the victim’s family

Post Midle
Post Midle