పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపనలు
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం లోని కంద్ది గడ్డ తాండ,శివలాల్ తాండా, శ్రీనివాస్ పురం,గుండ్ల గూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి SDF గ్రాంట్ కింద మంజూరు అయిన నిధులతో సిసి రోడ్లు, డ్రెయినేజీ, వివిధ సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ ను నేడు ఆయా గ్రామాల సర్పంచ్ లు ,వార్డ్ సభ్యులు,అధికారులు, మరియు పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.. అలాగే గుండ్లగూడెంలో నిర్మించిన ర్తెతు వేదికను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే ఫించెన్ రానివారికి ఫిన్చెన్,ఇండ్లు సిఎం కేసీఆర్ మంజూరి చేయనున్నారని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతు భీమ నమోదు లో నిర్లక్ష్యం తగదని ఆమె కోరారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ లు నవ్య శోభన్ బాబు, ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి,కేతావత్ సుజాత వీరయ్య నాయక్, ఎంపిటటీసి జూకంటి అనురాధ అనిల్ ,మార్కెట్ వ్తెస్ చ్తెర్మన్ గ్యాదపాక నాగరాజు మాజీ ఎంపిపి కాసగల్ల అనసూయా,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడుగంగుల శ్రీనివాస్ యాదవ్, ఎపిడిఓ,తహశీల్దారు ఆయా గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుండ్లగూడెంలో ఎమ్మెల్యే ను సర్పంచ్ ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు.
Tags: MLA Gongidi Sunita Concreting for various development projects