కార్మికులకు అండగా ఎమ్మెల్యే దీక్ష

Date:17/10/2020

రాజమండ్రి  ముచ్చట్లు:

పేపర్ మిల్లులో కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైకాపా సిటి కో ఆర్డినేటర్ ఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం తదితరులు పలుమార్లు చర్చించినా యాజమాన్యం దిగి రాకపోవడంతో పేపర్ మిల్లులోనే జక్కంపూడి రాజా, సిఐటియు నాయకులు టి.అరుణ్ దీక్ష చేపట్టగా శివరామ సుబ్రహ్మణ్యం దీక్షను ప్రారంభించారు. జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు అడపా వెంకటరమణ, నగర పార్టీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ యజమాన్యం తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

గుండె పోటుపై అవగాహనా కార్యక్రమం

Tags: MLA initiation in favor of workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *