ఎమ్మెల్యే జగనన్న విద్యా కానుక కార్యక్రమం
గూడూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినవ అంబేద్కర్ అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు . గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమం నిర్వహించారు . వాయిస్ ఓవర్ గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద రావు మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఏకైక ఆయుధం విద్య అని పేర్కొన్నారు . విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు . విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో స్థిరపడాలని సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, వైసిపి నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
Tags: MLA Jagananna Education Gift Program