జీవధార ఆక్షిజన్ వేయిటింగ్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

రాజానగరం ముచ్చట్లు :

కడియం మండలం కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్ భవనంలో జక్కంపూడి రామ్మోహనరావు పౌండేషన్ ఏర్పాటు చేసిన ఆక్షిజన్ వెయిటింగ్ హాల్ ను రాజానగరం ఎమ్మెల్యే. రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా ప్రారంభించారు.అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా చంటి,పాలకవర్గ సభ్యులు. నర్సరీ రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో కోవిడ్ భాదితులకు సహాయం అందించేందుకు జక్కంపూడి పౌండేషన్ తన వంతు సహకారం అందిస్తుందన్నారు.కేసుల తీవ్రత దృష్ట్యా ఆసుపత్రుల్లో బెడ్స్ లభించని పరిస్థితి ఉందన్నారు.ముఖ్యంగా ఆక్షిజన్ అసౌకర్యం తో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కోవిడ్ రోగులను ఆదుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.జగన్ స్ఫూర్తి తో జక్కంపూడి పౌండేషన్ పనిచేస్తుందని రాజా  అన్నారు.కోవిడ్ బాధితులకు 24/7 తమ హెల్ఫ్ లైన్ అందుబాటులో ఉంటుందన్నారు. అసోసియేషన్ కార్యాలయంలో ఆక్షిజన్ సదుపాయాలతో 10 బెడ్స్ సిద్ధంగా ఉంటాయన్నారు. రోగులకు అత్యవసరం ఇక్కడ ఆక్షిజన్ అందించి ఆసుపత్రికి తగిన చికిత్స నిమిత్తం తరలించడం జరుగుతుందన్నారు. రాజానగరం.రాజమహేంద్రవరం సిటీ.రూరల్  నియోజకవర్గాల్లో ఆక్షిజన్ వైటింగ్ హాల్స్ పాన్8చేస్తున్నాయన్నారు.కడియంమండలం కడియపులంక లో వే టింగ్ హాల్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన నర్సరీ మెన్ అసోసియేషన్ కు రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా చంటి. మాజీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం. వైసీపీ నాయకులు ఆకుల బాపిరాజు.తాడాల చక్రవర్తి,ముద్దాల అను,నర్సరీ రైతులు పుల్లా రామారావు.మార్గాని ఏడుకొండలు.జక్కంపూడి పౌండేషన్ ప్రతినిధి కొత్తపల్లి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:MLA Jakkampudi Raja inaugurated the Lifeline Oxygen Waiting Hall.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *