వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ 

MLA JP Prabhakar, who started a medical camp

MLA JP Prabhakar, who started a medical camp

Date:26/11/2018
అనంతపురం ముచ్చట్లు:
తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దపప్పూరు మండలం పి.కొట్టాలపల్లి గ్రామంలో సోమవారం ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి  ప్రారంభించారు. కేన్సర్ వ్యాధి ప్రబలుతోందన్న వదంతులు వ్యాపించిన నేపథ్యంలో గ్రామస్తుల్లో నెలకొన్న భయాందోళనను పోగొట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి జిల్లా,మండల స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బందితో కూడిన వైద్య బృందం హాజరయి గ్రామస్తులకు పలు వైద్య పరీక్షలు జరిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ నీటి వల్ల కేన్సర్ వ్యాధి సోకదని ఇది కేవలం అపోహ మాత్రమేనన్నారు. వైద్య శిబిరంలో గ్రామస్తులందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి ప్రత్యేకించి కేన్సర్ వ్యాధికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బందికి సూచించారు.
ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు ప్రత్యేకించి లివర్ ,కిడ్నీల పని తీరు, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించి పాప్స్ మియర్, వి.ఐ.ఏ పరీక్షలు,అలాగే రొమ్ము, నోటి కేన్సర్లకు సంబంధించి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జ్యోష్ణ, ఎన్సిడి గంగాధర్ రెడ్డి, డిఈఎంఓ ఎల్.ఉమాపతి, డిఎన్ఎంఓ ఇర్షాద్ అహమ్మద్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం మేనేజర్ ఆంజనేయులు, లేపాక్షి, కురుగుంట, రాప్తాడు, యల్లనూరు, తిమ్మంపల్లి, పుట్లూరు, పెద్దపప్పూరు, చుక్కలూరు వైద్యాధికారులు శ్రీదేవి, ఫిరదౌస్, ముంతాజ్, శ్రీవాణి, వినయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ కుమార్, వేముల సత్యనారాయణ,హెల్త్ ఎడ్యుకేటర్లు సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:MLA JP Prabhakar, who started a medical camp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *