Natyam ad

ఆర్ అండ్ బి అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే కోనప్ప

ఆసిఫాబాద్ ముచ్చట్లు:


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో   ఆర్ అండ్ బి అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుండి కాగజ్ నగర్ వెళ్ళే రోడ్డుపై ఎందుకు అలసత్వం చేస్తున్నారని ఆర్ అండ్ బి అధికారుల తీరుపై మండి పడ్డారు.. మీ ఇంటికి వెళ్ళే దారి ఇలాగే ఉందా..అని నిలదీశారు.
ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పలేక పోతున్నామని, తమకు ఈ పదవి ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే… కానీ స్పష్టంగా చెప్పండి ఎపుడు చేస్తారో అని నిలదీశారు. మీరు అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. మార్చి నెలలో సమస్యలపై మెసేజ్  పెడితే ఇంత వరకు అధికారులు స్పందించలేదనీ అసహనం వ్యక్తం చేశారు.అంత అలసత్వమా… అని ప్రశ్నించారు.  మరికొన్ని  శాఖల తీరుపై ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో పాటు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు  పలు సమస్యలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో మాట్లాడుకోవడం, తీర్మానాలు చేయడం తప్ప అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు.

 

Tags: MLA Konappa angry with R&B officials

Post Midle
Post Midle