జిల్లా ఎస్పీ ని కలిసిన ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం 

– సత్యవేడు ప్రశాంతతకు సహకరించాలని ఎస్పీ కి విజ్ఞప్తి

 

సత్యవేడు ముచ్చట్లు:

 

తిరుపతి జిల్లా ఎస్పీ  వి.హర్షవర్ధన్ రాజు ని సత్యవేడు ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం  గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఉదయం 11 గంటలకు తిరుపతి లోని ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే గారు చేరుకొని ఎస్పీ  హర్షవర్ధన్ రాజు కి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ సత్యవేడు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉందని, నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండేలా సహకరించాలని జిల్లా ఎస్పీ కి విజ్ఞప్తి చేశారు.అందుకు ఎస్పీ  సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  వెల్లడించారు.

 

Tags:MLA Koneti Adimulam who met the District SP

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *