బారా షహీద్ దర్గా ముఖద్వారాల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు గ్రామీణం ముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని బారాషాహిద్  దర్గా  ముఖద్వారాలు (ఆర్చలు ) నిర్మాణ పనులకు  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , నగర మేయర్ పొట్లూరు స్రవంతి  మరియు నుడా చైర్మన్  ముక్కాల ద్వారకానాథ్ లు సోమవారం సంయుక్తంగా శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బారాషాహిద్  దర్గాను సుందరంగా  తీర్చిదిద్దే లక్ష్యంగా దర్గా అభివృద్ధికి నిరంతరం కృషి చేయడంలో భాగంగా  కోటి రూపాయల వ్యయంతో ఈ ముఖద్వారాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.రాజకీయాలు ముఖ్యం కాదని ,అభివృద్ధి కార్యక్రమాలే   ముఖ్యమని  బారాషాహిద్ దర్గా బయటే రాజకీయమని  దర్గా లోపల ఆధ్యాత్మిక  భావం ఒక్కటే ఉంటుందన్నారు.

 

రాజకీయాలకు అతీతంగా మాజీ మేయర్ టిడిపి పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టిడిపి మాజీ మంత్రి నారాయణ, అదే విధంగా అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బారాషాహిద్  దర్గాకు కోటి రూపాయలు నిధులు కేటాయించిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్   కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ బారాషాహిద్  దర్గా అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం   చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సేవలను కొనియాడారు. బారాషాహిద్  దర్గా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి  ముస్లిం ప్రజలందరి తరపున  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ముక్కాల పేర్కొన్నారు.పై కార్యక్రమంలో  35వ డివిజన్ కార్పొరేటర్  యాకసిరి వాసంతి, ముస్లిం మత పెద్దలు  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: MLA Kotam Reddy laid the foundation stone for the works of Bara Shaheed Dargah

Leave A Reply

Your email address will not be published.