MLA Kotamreddy congratulated the directors of BC Corporations

బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Date:20/10/2020

నెల్లూరు ముచ్చట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  56 బీసీ కులాల  కార్పొరేషన్ చైర్మన్ లను ఏంటిది చేసింది. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన ఆరు బిసి కులాల కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఆరు బీసీ కులాల కార్పొరేషన్ డైరెక్టర్లను మంగళవారం నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఘనంగా అభినందించారు .రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి బి.సి. కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా పదవులు లభించిన అత్తివరపు మల్లేశ్వరి (రజక కార్పొరేషన్), కనకట్ల నరసింహ ముదిరాజ్ (ముదిరాజ్ కార్పొరేషన్), అన్నపరెడ్డి శ్రీదేవి (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్), రాణిగ్రం కోటి సింగ్, వెండ్లూరు ఉమామహేశ్వరి భాయి (బొందిలి కార్పొరేషన్) మరియు తిరువళ్లూరు దివిజ (విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్) 6 మందిని స్థానిక తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనివిధంగా బి.సి. వర్గాలను ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆయన సేవలను కొనియాడారు.

 

నెల్లూరు రూరల్ కి 6 డైరెక్టర్ పదవులు వచ్చేదానికి కృషిచేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సజ్జల రామకృష్ణా రెడ్డి కి, రాష్ట్ర పార్టీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి, ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ తమ కులాల అభివృద్ధికి పాటుపడాలని డైరెక్టర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

త్వరలో వైఎస్సార్ జన చైతన్య యాత్ర

Tags:MLA Kotamreddy congratulated the directors of BC Corporations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *