సీఎం సహాయనిధి  చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ప్రతిష్టాత్మకంగా అమలుచేయడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు ,వైద్య ఖర్చుల నిమిత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎన్నడూ లేని విధంగా ఉదారంగా ఆర్ధిక సహాయం అందచేస్తున్నారు అని ఆయన సేవలను కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకు వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేకంగా వైద్యం అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:MLA Kotamreddy handing over the CM assistance fund checks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *