MLA Kotamreddy inaugurated the park in 22nd Division Shar Colony

. 22 వ డివిజన్ షార్ కాలనీలో పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Date:17/10/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్, షార్ కాలనీలో 35 లక్షల రూపాయల నుడా నిధులతో నిర్మించిన నూతన పార్కును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన పార్కులు, పదికాలాలపాటు ప్రజలకు ఉపయోగపడాలంటే వాటి అభివృద్ధి బాధ్యత స్థానికులు నిర్వహణ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనావాసాలతో వేగవంతంగా విస్తరిస్తున్న ఈ షార్ కాలనీలో, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒకచక్కటి పార్కును నిర్మించటం జరిగిందన్నారు.
స్థానిక ప్రజలు వ్యాయామానికి, వాకింగ్ కు ఈ పార్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు
. ఈ కార్యక్రమంలో నుడా వైస్ ఛైర్మెన్ నవ్య, నెల్లూరు గ్రామీణ నియోజవర్గ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇ ఇ మరియు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 జిల్లా ప్రజలకు, తెదేపా కుటుంబ సభ్యులకు రెడ్యం విజయ దశమి శుభాకాంక్షలు

Tags:MLA Kotamreddy inaugurated the park in 22nd Division Shar Colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *