Natyam ad

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు  నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

భారత మాత ముద్దుబిడ్డ భారత దేశ స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు వాడి ఖ్యాతిని చూపించినటువంటి  శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు  జయంతి సందర్భంగా మద్రాస్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో తన జీవితమంతా నిస్వార్థ సేవకుడిగా, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని ఆయన సామాజిక సేవల గురించి కొనియాడారు.  అలాంటి మహా నేతల  బలిదానాలతో, ఆత్మ తర్పణాలతో, త్యాగాలతో, పోరాటాలతో, వచ్చినటువంటి భారత స్వాతంత్రాన్ని సమాజంలో అన్ని వర్గాల వారికి  మేలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆనాడు దేశం కోసం పోరాటం చేసినటువంటి  వారి ఆలోచన ఆకాంక్షలకు మేలు చేసే విధంగా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు.పై కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్  దాసరి అమృత, 38వ డివిజన్ అధ్యక్షుడు దాసరి రాజేష్, 19వ డివిజన్ అధ్యక్షుడు మదన్   మోహన్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: MLA Kotamreddy paid tributes to Sri Tanguturi Prakasam Pantulu

Post Midle

Leave A Reply

Your email address will not be published.