ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు

నెల్లూరు ముచ్చట్లు:

మన ప్రభుత్వం రెండవ విడత కార్యక్రమాన్ని స్థానిక 1వ డివిజన్ పరిధిలోని నారాయణపేటలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ  ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజలనుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వాలంటీర్లతో ఆయా ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అందరికీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని స్థానిక ప్రజల సమక్షంలో వాలంటీర్లను ప్రశ్నించారు. గ్రామీణ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు,2 డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, గంగి జయరామి రెడ్డి, నాపా సుబ్బా రావు, కరీముల్లా, సుధాకర్ రెడ్డి, లక్ష్మి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: MLA Kotamreddy People gave a warm welcome to Sridhar Reddy

Leave A Reply

Your email address will not be published.