తెరాస విజయం పై ఎమ్మెల్యే మాధవరం స్పందన

Date:05/12/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

కూకట్ పల్లి, ఫతే నగర్, ఓల్డ్ బోయిన్ పల్లి,  కేపీ.హెచ్.బి, బాలాజీ నగర్, బాలానగర్, అల్లా పూర్ అన్ని డివిజన్ లో టి.ఆర్.ఎస్ జెండా ఎగరవేశాం. నియోజకవర్గంలో గత ఎంపీ ఎన్నికలలో 6 వేల మెజారిటీ ఉంటే ఈసారి   30 వేల ఓట్ల మెజారిటీ రావడం జరిగిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి ప్రజలు ఏకపక్షంగా టి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించారు. మూసాపేట్ మినహా మిగిలిన అన్ని స్థానాలను టి.ఆర్.ఎస్ కైవసం చేసుకుంది. 17 సీట్లు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించలేకపోయిమని అన్నారు.  మూసాపేట్ డివిజన్ లో పదిహేను వందల ఓట్లు పైగా తిరస్కరించడం జరిగింది. అధికారుల తప్పిదం వల్ల మూసాపేట్ కు సంబంధించిన రెండు వేల ఓట్లు బాలాజీ నగర్ లో కలపడం కూకట్ పల్లి కి సంబంధించిన ఓట్ల వివేకానంద నగర్ లో కలపడం వల్ల మెజారిటీ తగ్గింది. గ్రేటర్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి మంత్రులు , పక్క రాష్ట్ర సీఎం లు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఒక రౌడీల్లా ప్రవర్తిస్తూ మతకలహాలు సృష్టించే విధంగా చేశారు.  ఎంతమంది కష్టపడ్డ హైదరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.

చిన్నారిని చితకబాది హతమార్చిన తండ్రి

Tags: MLA Madhavaram’s response to Teresa’s victory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *