మహిళా హస్టల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:


శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగకాలనీనందుఉన్న బీసీ మహిళలహాస్టల్ లో  భోజన సదుపాయం సరిగ్గా లేదని, మంచినీటి వసతి లేదని, నేడోరేపో కూలిపోయే విధంగా హాస్టల్స్ బిల్డింగ్స్ ఉన్నాయి అంటూ విద్యార్థినిలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే  వెంటనే బీసీ హాస్టల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లోని భోజనశాలకు వెళ్లి భోజన వసతులు పరిశీలించారు. భోజనం వసతి సరిగ్గా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఈటువంటి భోజనం పెట్టడం సమంజసమా అంటూ హాస్టల్ వార్డెన్ నిలదీశారు. హాస్టల్ పరిసరప్రాంతాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోవడంతో అధికారులను పిలిపించి వెనువెంటనే  హాస్టల్ పరిసరప్రాంతాల శుభ్రం చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించడానికి వంట సామాగ్రిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు తన సొంత నిధులతో తీసుకుని వచ్చి విద్యార్థులకు అందజేశారు.మరో మరు విద్యార్థినిలు ఫిర్యాదు చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామంటూ హాస్టల్ వార్డెన్ ను హెచ్చరించారు.

 

Tags: MLA Madhusudhan Reddy inspected the women’s hostel

Leave A Reply

Your email address will not be published.