-స్మశాన వాటిక అభివృద్ధికి ముందడుగు వేసిన ఎమ్మెల్యే
-సొంత నిధులతో నిజామాబాద్ లోని పాల్డా గ్రామం కు శ్మశానవాటిక ఏర్పాటు
Date:23/02/2021
మల్కాజిగిరి ముచ్చట్లు:
సర్వజనుల సంక్షేమానికి అహర్నిశలు పరితపించే స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరో అడుగు ముందుకు వేశారు.నిజామాబాద్ జిల్లాలోని ఓ పురాతన ఆలయ అభివృద్ధికి తన సొంత నిధులు కేటాయించడమే కాకుండా, అదే ప్రాంతంలో ఉన్న గ్రామానికి స్మశాన వాటిక లో అన్ని ఏర్పాట్లకు తన సొంత నిధులను వెచ్చించడం జరిగింది అని ఎమ్మెల్యే అభిమానులు పేర్కొంటున్నారు.
సొంత నిధులతో స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా పాల్డాగ్రామం లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్మశాన వాటిక అభివృద్ధి కోసం ముందడుగు వేశారు. ఇందులో భాగంగా స్మశాన వాటికలో అన్ని రకాల వసతి సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా సుమారు 21 అడుగుల ఎత్తయిన శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. స్మశాన వాటిక చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: MLA Mainampalli Hanmantrao’s contribution to the development of the ancient temple