అమరావతి ముచ్చట్లు:
అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే తాడేపల్లికి రావాలని జొన్నలగడ్డ పద్మావతికి సీఎంవో నుంచి పిలుపు వెళ్లింది. ఈ నేపధ్యంలో ఆమె మంగళవారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి సహా సీఎం జగన్ ను కలిసారు. తనకు శింగనమల సీటు నిరాకరించడంపై సీఎంవో పై ఎమ్మెల్యే పద్మావతి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేసారు. మా కాలువలనుంచి మేము తాగునీటి విడుదల కోసం సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఫేస్ బుక్ ద్వారా సీఎంవోపై విమర్శలు చేయడంతో సీఎం కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. తన వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇచ్చేందుకు ఆమె వచ్చారు.
Tags: MLA Padmavathi who came to CMO