జిన్నూర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
బెల్లంపల్లి ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా జిన్నూరు లోఅల్లూరీ సీతరామరాజు సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం ,సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంకు ముఖ్య అధితిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ట్రస్టు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరం సమయంలో అల్లూరి సీతారామరాజు రంపచోడవరం లో బ్రిటిష్ సైన్యం పై తిరుగుబాటు చేసిన ఆయుధాలు,ఆయన వాడిన వస్తువలను ,హరిదాసులు, గంగిరెద్దులు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండగ సమయంలో కరోన నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొడ జనార్దన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జూల లక్ష్మన్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: MLA participating in Jinnoor Sankranthi celebrations